బాలీవుడ్ వర్ధమాన హీరోయిన్ దివ్యా చౌక్సి మృతి!

బాలీవుడ్ కి 2020 చేదు జ్ఞాపకాలు మిగుల్చుతుంది. అనేక విషాదాలు బాలీవుడ్ లో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక మంది నటులు వివిధ కారణాల చేత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రిషి కపూర్, ఇర్పాన్ ఖాన్, సుశాంత్ రాజ్ పుత్, కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తో పాటు మరికొందరు తుది శ్వాసవిడిచారు. ఇక ప్రక్క కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమ కుదేలు అవడంతో పాటు ఉపాధి లేక అనేకమంది అల్లాడుతున్నారు.

దీనికి తోడు వరుస మరణాలు బాలీవుడ్ ప్రముఖులను క్రుంగ దీస్తున్నాయి. కాగా నిన్న మరో యువ నటి మరణించడం జరిగింది. వర్ధమాన హీరోయిన్ అయిన దివ్యా చౌక్సి క్యాన్సర్ కారణంగా తనువు చాలించారు. ఏడాదిన్నగా ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చివరికు నిన్న మరణించడం జరిగింది. ఆమె మరణానికి ముందు ఓ విషాద సందేశం సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న నేను చివరి దశకు చేరాను అన్నారు, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.

మరొక జన్మ ఉంటే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇక నన్నేమీ అడగొద్దన్న ఆమె మీ ప్రేమకు కృతజ్ఞతలు అని సందేశంలో పొందుపరిచారు. దివ్యా చౌక్సి ఒకసారి క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకొని, క్యూర్ అయ్యారు. ఐతే అది మరలా తిరగబెట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దివ్యా చౌక్సి సొంత ఊరు భోపాల్ కాగా, ఆమె అక్కడే మరణించారు. 2016లో వచ్చిన అప్నా దిల్ తో ఆవారా మూవీతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus