‘బిగ్ బాస్ సీజన్ 9’(Bigg Boss 9) క్లైమాక్స్ కి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరు అనేది తేలిపోతుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ గా తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యూల్, సంజన,డీమోన్ పవన్ నిలిచారు. వీరిలో విజేతగా ఎవరు నిలుస్తారు? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.తనూజ, కళ్యాణ్ పడాల.. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. టాప్ 2 లో కచ్చితంగా కళ్యాణ్, తనూజ ఉంటారని కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు.
ఇక టాప్ 3 లో ఇమ్మాన్యూల్ ఉంటాడనే టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో సగం ప్రైజ్ మనీ టాప్ 3 కి ఆఫర్ చేసినప్పుడు.. అతను ఓకే చెప్పి.. దాంతో హౌస్ కి గుడ్ బై చెప్పే అవకాశం కూడా ఉందని కొందరు చెబుతున్నారు.
సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ప్రతిసారి విన్నర్ కి ప్రైజ్ మనీ రూ.50 లక్షలు ఉంటుంది. అది పూర్తిగా విన్నర్ కి వెళ్ళదు. 18% జీఎస్టీ పోతుంది. అలాగే ఏదైనా ప్లాట్ వంటివి ఇస్తామని చెబుతుంటారు. అది ఇవ్వడం లేదు అని గత విజేతల నుండీ కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఈసారి మాత్రం కచ్చితంగా విన్నర్ ప్రైజ్ రూ.50 లక్షలతో పాటు ఒక కారు, అలాగే రియల్ ఎస్టేట్ వారు స్పాన్సర్ మేరకు ఒక ప్లాట్ కూడా ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది.
సో వాటి వాల్యూ ప్రకారం.. మొత్తంగా విన్నర్ రూ.80 లక్షల వరకు గెలుచుకునే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. అలాగే విన్నర్ హౌస్లో ఉన్నన్ని రోజులకు గాను అందుకునే పారితోషికం అదనం అన్నమాట.