షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన సందీప్ రాజ్(Sandeep Raj) ‘కలర్ ఫోటో’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అందుకే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, రవితేజ వంటి పెద్ద హీరోలు ఇతన్ని పిలిచి సినిమా చేద్దామని అడిగారు. అయితే రవితేజతో సినిమా చేయడం కోసం దాదాపు 3 ఏళ్ళు ఎదురుచూశాడు సందీప్. ఈ మధ్యలో ‘ముఖచిత్రం’ అనే సినిమాని ప్రొడ్యూస్ కూడా చేశాడు.దానికి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించాడు.
అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాలో విశ్వక్ సేన్ తో కూడా చిన్న పాత్ర చేయించారు. ఆ రోల్ ఇంకా కామెడీగా అనిపించింది ఆడియన్స్ కి.! అందువల్ల ఆ పాత్ర బిజినెస్ చేసుకోవడానికి తప్ప.. బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడానికి కలిసిరాలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల దర్శకుడు సందీప్ రాజ్ ‘ముఖ చిత్రం’ సినిమా ఫలితంపై స్పందించాడు.
సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ” ‘ముఖచిత్రం’ అనే సినిమా విషయంలో ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదు. నేను మళ్ళీ చెబుతున్నా.. డైరెక్షన్ కాదు ఎగ్జిక్యూషన్ కుదర్లేదు. నా స్థాయికి నేను ఎంత వరకు డబ్బులు తీసుకురాగలనో.. అంత తీసుకొచ్చి ఆ సినిమాకి పెట్టాను. కానీ ఆ కథ అలా చెప్పకూడదు. కొంచెం కాస్ట్ లీగా చెప్పాలి. ఓ మంచి కాస్ట్ లీ హాస్పిటల్లో చేయాలి,ప్లాస్టిక్ సర్జెరీ కాన్సెప్ట్ అనేది రిచ్ గా చెప్పాలి.
ఏదో ఆషామాషీగా చెప్పేశామనే ఫీలింగ్ మాకు కూడా వచ్చింది. ఏ కథైనా చెప్పడానికి ఒక స్థాయి ఉండాలి. ‘బాహుబలి’ వంటి సినిమా అయినా పేపర్ మీద వేరుగా ఉంటుంది. తీస్తున్నప్పుడు ఆ క్వాలిటీ ఇవ్వగలిగితేనే.. దానికి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. లేదు అంటే డిజాస్టర్. ‘మోగ్లీ’ సినిమాలో హీరో వేసుకునే కాస్ట్యూమ్స్ కనుక ‘బాహుబలి’ లో వేసినా అది డిజాస్టర్.
అలాగే ‘ముఖచిత్రం’ లో హాస్పిటల్స్ కానీ, ఇల్లు కానీ బాలేదు. అందుకే ఆ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.