Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అనిరుధ్ శ్రీవాత్సవ్ (Hero)
  • హెబ్బా పటేల్ (Heroine)
  • రాకేందుమౌళి, మౌర్య, మ్యాడీ, కల్పిక గణేష్, యశ్న తదితరులు (Cast)
  • కళ్యాణ్ జి గోగన (Director)
  • ప్రఖ్య అనిరుధ్ శ్రీవాత్సవ్ (Producer)
  • సాయికార్తీక్ - రాకేందుమౌళి (Music)
  • ఎం.ఎన్.బాల్ రెడ్డి (Cinematography)
  • మణికాంత్ - మ్యాడీ మానేపల్లి (Editor)
  • Release Date : డిసెంబర్ 19, 2025
  • సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ - కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ - రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ (Banner)

హెబ్బా పటేల్ తన నిజజీవిత పాత్ర పోషించిన చిత్రం “మారియో”. అసలు రిలీజ్ అవుతున్నట్లుగా కూడా తెలియని హడావుడిలో రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

Mario Telugu Movie Review

కథ: మనిషికి జూదం, మద్యం, కామం వంటి వాటి మీద విపరీతమైన వ్యామోహం పెంచే ఒక మాదకద్రవ్యాన్ని కనిపెట్టిస్తాడు బాబ్ మార్లే (రాకేందుమౌళి). ఆ డ్రగ్ ను సిటీలో అందరికీ అలవాటు చేయడానికి హీరోయిన్ హెబ్బా పటేల్ (హెబ్బా పటేల్)ను ఓ సాధనంగా మార్చుకుంటాడు. ఈ ఛట్రంలో అనుకోకుండా ఇరుక్కుంటాడు మన హీరో (అనిరుధ్).

ఆ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఆ డ్రగ్ మాఫియా నుండి హెబ్బాను ఎలా బయటపడేసాడు? అసలు ఆ డ్రగ్ మాఫియా హెబ్బాను ఎందుకు టార్గెట్ చేసింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “మారియో” చిత్రం.

నటీనటుల పనితీరు: ఇప్పటివరకు క్యారెక్టర్ రోల్స్ లో కనిపించిన రాకేందుమౌళి ఈ చిత్రంలో ఒక ఫుల్ లెంగ్త్ విలన్ రోల్లో ఆకట్టుకున్నాడు. అతడి డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ బాగా వర్కవుట్ అయ్యాయి.

హీరో అనిరుధ్ పర్సనాలిటీకి, అతడి డబ్బింగ్ కి అస్సలు సింక్ అవ్వలేదు. అందువల్ల అతడు మాట్లాడుతున్నప్పుడల్లా.. డబ్బింగ్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. కాకపోతే.. అతని పాత్ర రిలేటబుల్ గా ఉండడంతో ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.

హెబ్బా పటేల్ తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి చాలా హుందాగానే కనిపించింది. కాకపోతే.. ఆమె యద సోయగాలను మరీ ఎక్కువసార్లు, అవసరం లేని యాంగిల్స్ లో చూపించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకుని ఇబ్బందిపెట్టారు మేకర్స్.

మౌర్య తనదైన యాసతో నవ్వించగా.. యశ్న గ్లామర్ డోస్ కొంతమేరకు ప్రేక్షకుల్ని అలరించింది.

క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చినా.. ఎడిటర్ కమ్ యాట్కర్ మ్యాడీ అల్ప తెలుగు జోకులు బాగానే పేలాయి.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డి ఈ సినిమాకి హీరో అని చెప్పాలి. కంటెంట్ కొన్ని చోట్ల పెద్దగా అలరించలేకపోయినా.. క్వాలిటీతో మ్యానేజ్ చేశాడు. చిన్న సినిమా చూస్తున్న భావన ఎక్కడా కలగనివ్వలేదు.

బ్యాగ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. హాయి హాయిగా పాట వినసొంపుగా, అర్థవంతంగా ఉంది.

దర్శకుడు కళ్యాణ్ గోగన మల్టీ లేయర్ కామెడీ ఎంటర్టైనర్ గా “మారియో” సినిమాని తెరకెక్కించాడు. జోక్స్ బాగా రాసుకున్నాడు, స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా ఉంది. అయితే.. కొన్ని సీక్వెన్సులు సరిగా వర్కవుట్ అవ్వలేదు. అసలు హెబ్బా పటేల్ తోనే డ్రగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయించాల్సిన అవసరం ఏముంది? ఆమె మాత్రమే ఎందుకు చేయాలి? అనేదానికి సరైన రీజన్ లేదు. అలాగే.. ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే తీరు కూడా సరిగా సింక్ అవ్వలేదు. అందువల్ల కామెడీని ఎంజే చేసినా.. పూర్తిస్థాయి సంతృప్తినివ్వలేకపోయేవి.

కాకపోతే.. ఒక దర్శకుడిగా ఇండస్ట్రీ మీద, హీరోయిన్ల లైఫ్ స్టైల్ మీద వ్యంగ్యపు సన్నివేశాలు తీసే స్కోప్ ఉన్నా కూడా.. వాళ్లని రెస్పెక్ట్ ఫుల్ గా ట్రీట్ చేసిన విధానం అభినందనీయం. అలాగే.. రొమాన్స్ ను మరీ అశ్లీలంగా చూపకుండా జాగ్రత్తపడిన తీరు సంతోషం. ఓవరాల్ గా దర్శకుడిగా, కథకుడిగా కల్యాణ్ గోగన ప్రేక్షకుల్ని అలరించాడనే చెప్పాలి.

విశ్లేషణ: కొన్ని సినిమాలకి లాజిక్కులతో సంబంధం లేకుండా.. టైంపాస్ కోసం చూసేయొచ్చు. “మారియో” అలాంటి సినిమానే. జెన్ జీ & మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ గ్యాంగ్ తో చూసి ఎంజాయ్ చేయొచ్చు!

ఫోకస్ పాయింట్: టైంపాస్ కామెడీ ఎంటర్టైనర్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus