సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణించారు. లేడీ డైరెక్టర్ అపర్ణ మల్లాది నుండీ సీనియర్ స్టార్ డైరెక్టర్ ఏ.ఎస్.రవికుమార్ చౌదరి వంటి వారు… అలాగే కోటా శ్రీనివాసరావు వంటి దిగ్గజ నటులు కూడా మరణించడం జరిగింది. అలాగే ఇంకా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో, రోడ్డు ప్రమాదాల వల్లనో మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొంతమంది సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా ఇంకో స్టార్ సెలబ్రిటీ మృతి చెందడం ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది.వివరాల్లోకి వెళితే… మలయాళం సీనియర్ స్టార్ నటుడు, రైటర్, దర్శకుడు అయినటువంటి శ్రీనివాసన్(Sreenivasan) మృతిచెందారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన కొచ్చిలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చారు.
ఓ దశలో కోలుకుంటున్నట్టు కనిపించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో ఆయన సొంత నివాసంలో కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది. శ్రీనివాసన్ వయసు 69 ఏళ్ళు. ఆయన మృతి మలయాళ సినీ పరిశ్రమని కుదిపేసింది అనే చెప్పాలి. ఈ క్రమంలో కొందరు మలయాళ సినీ ప్రముఖులు ఆయన మృతికి చింతిస్తూ తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
1976 లో సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాసన్.. ఇప్పటివరకు దాదాపు 300 కి పైగా సినిమాల్లో నటించారు. 50 కి పైగా సినిమాలకి రైటర్ గా కూడా పనిచేశారు. అలాగే పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కానీ అవి మంచి ఫలితాలు ఇవ్వలేదు. ఈయన ఖాతాలో ఒక నేషనల్ అవార్డు కూడా ఉండటం విశేషం.