Nabha Natesh: గోల్డ్ కలర్‌ చీరలో నభా నటేష్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Ad not loaded.

నభా నటేష్ (Nabha Natesh) .. కన్నడ సినిమాలతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ‘నన్ను దోచుకుందువటే’ (Nannu Dochukunduvate)  మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో చిత్రించిన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar)  తో మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఈ సినిమాలో చాందిని అనే పాత్రలో తనదైన గ్లామర్‌, యాక్టింగ్‌ స్కిల్స్ తో వెండితెరపై మాయ చేసింది. 2022 లో ఈ బ్యూటీకి యాక్సిడెంట్ అవ్వడం వలన కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలే డార్లింగ్ (Darling) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ కలిగిన అమ్మాయిగా కనిపించనుంది.

Nabha Natesh

ప్రస్తుతం ఈ అమ్మడు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు (Swayambhu)  మూవీలో నటిస్తోంది. ఇంకా ఈ భామ సమయం దొరికినప్పుడల్లా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. తాజాగా గోల్డ్ కలర్‌తో చమ్కీలు ఉన్న ఈ ఆకర్షణీయమైన చీర ధరించి మరింత అందంతో మైమరిపించింది. అంతే కాకుండా ఆ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో గోల్డ్ అనే క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలకు కురాళ్లు లైక్‍లు, కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus