కరోనా విజృంభణ తగ్గింది.. థియేటర్లు తెరుచుకున్నాయి.. మెల్ల మెల్లగా ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లకు వస్తున్నారు అని అంతా సంతోషించేలోపే మళ్ళీ దీని తీవ్రత పెరుగుతూ ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో అలాగే మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ మొదలైందని వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా దీని భారిన పడుతుండడంతో అందరిలోనూ అలజడి నెలకొంటుంది.
ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా కరోనా భారిన పడుతుండడంతో ఈ విషయం చర్చనీయాశం అయ్యింది. తాజాగా ఒకప్పటి హీరోయిన్ మరియు ఇప్పటి సహాయ నటి అయిన నదియా కరోనా భారిన పడింది. ఈమె ఆల్రెడీ వ్యాక్సిన్ కూడా వేయించుకుంది. అయినప్పటికీ ఈమె కరోనా భారిన పడింది. ఓ పక్క ఆందోళన చెందొద్దు అని ఆమె సన్నిత వర్గం చెబుతున్నప్పటికీ.. ఆమె వయసు 54 ఏళ్ళు కావడంతో ఇన్నర్ గా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది.
ఆమె తొందరగా కోలుకోవాలి అని సినీ ఇండస్ట్రీ నుండీ కొంతమంది సినీ ప్రముఖులు ఆమెకు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ‘ఘని’ ‘వరుడు కావలెను’ ‘దృశ్యం2’ వంటి చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీగా గడుపుతుంది. ఈమె కరోనా భారిన పడడంతో ఆ సినిమాల్లో ఈమె పోర్షన్ షూటింగ్ ను రీ షెడ్యూల్ చేయబోతున్నారట.