ఇప్పుడంటే హీరోయిన్లు ఫోటోషూట్స్ అనగానే బట్టలిప్పేస్తున్నారు, ఇక క్యాలెండర్ షూట్ అనేసరికి బికినీలు తప్ప మాములు బట్టలు వేయడం లేదు. అలాంటిది శరీరంతో ముఖం తప్ప కనీసం మీద భాగం కూడా చూపించకుండా ఒక క్యాలెండర్ షూట్ జరిగిందని, అది విడుదలై అప్పట్లోనే హల్ చల్ చేసిందనే విషయం మీకు తెలుసా?. ఇప్పుడంటే అందరికీ హోల్ సేల్ అత్త అయిపొయింది కానీ.. ఒకప్పటి బిజీ హీరోయిన్ నదియా 1986లో ఓ క్యాలెండర్ షూట్ కోసం దిగిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
అత్తగారు అప్పట్లోనే రచ్చ అన్నమాట అనుకుంటున్నారు జనాలు. అయితే.. “మిర్చి, అత్తారింటికి దారేది” లాంటి సినిమాతో వచ్చిన క్రేజ్ ను నదిగా సరిగా వినియోగించుకోలేదు. డబ్బు కోసమే, కాంబినేషన్ కోసమో ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసి తన రీఎంట్రీకి వచ్చిన హైప్ ను వేస్ట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క క్రేజీ ప్రాజెక్ట్ కూడా లేదు. దర్శకనిర్మాతలు కూడా ఇదివరకటిలా ఆమెకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు.
అందుకు కారణం ఆమె ఒప్పుకొన్న మరియు చేసిన కొన్ని సినిమాలు. మరి సెకండ్ ఇన్నింగ్స్ ను మళ్ళీ సక్సెస్ జోన్ లోకి తెచ్చుకోవడానికి నదియా ఏం చేస్తుందో చూడాలి. ఇకపోతే.. నదియా ప్రస్తుతం నాగశౌర్య-రీతువర్మ జంటగా తెరకెక్కుతున్న “వరుడు కావలెను” చిత్రంలో నటిస్తోంది.