రాజకీయాల్లోకి నమిత..!
- April 23, 2016 / 10:16 AM ISTByFilmy Focus
తమిళనాడు లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో.. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల ప్రచార హడావుడిగా ఉన్నారు. పలువురు సినీ తారలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి మద్దతుగా సూపర్ స్టార్ రజనీ కాంత్ మూడు బహిరంగ సభల్లో ప్రసగించనున్నట్లు సమాచారం.
అయితే తాజా సమాచారం ప్రకారం సినీ నటి నమిత కూడా త్వరలో రాజకీయ తీర్ధం పుచ్చుకొనుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏఐఎండికే పార్టీలో చేరడానికి ఆమె సుముఖంగా ఉన్నారని, ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నమిత లేఖ కూడా రాశారని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం ఆమె ఎటువంటి చిత్రాల్లో నటించడం లేనందునే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు తమిళ తంబీలు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











