Namrata: శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నమ్రత… వీడియో వైరల్!

  • March 8, 2023 / 04:47 PM IST

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు. అయితే వారికి సినిమా షూటింగుల నుంచి ఏమాత్రం విరామం దొరికిన ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళుతూ తమలో ఉన్నటువంటి భక్తి భావాన్ని చాటుకుంటూ ఉంటారు. సెలబ్రిటీలు సినిమా షూటింగులనుంచి విరామం దొరికితే పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి నమ్రత సైతం శ్రీవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

ఇండస్ట్రీలో నటిగా ఒకప్పుడు ఎంతో బిజీగా ఉన్నటువంటి నమ్రత ప్రస్తుతం సినిమాలకు దూరమై ఇతర వ్యాపారాలను కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇలా వృత్తి పరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నమ్రత తాతగా తెలంగాణలోని వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈమె సందర్శించారు. ఈ విధంగా నమ్రత ఈ ఆలయాన్ని సందర్శించడంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

ఈ ఆలయానికి చేరుకున్నటువంటి నమ్రత పద్మావతి, అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ గోశాలను కూడా సందర్శించారు. తెలంగాణలో చిన్న తిరుపతిగా పేరు పొందినటువంటి ఈ ఆలయంలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా నమ్రత స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. ఈ ఆలయానికి కనుక వస్తే తనకు తిరుపతి వెళ్ళిన అనుభూతి కలుగుతుందని,ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నమ్రత తెలియజేశారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus