నయన్ సినిమాలు వదిలేయాలనుకుంది!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్ గా మారిపోయాయి. కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే మరికొందరి ప్రేమ మాత్రం పెళ్ళి వరకు వెళ్లకుండా మధ్యలోనే బ్రేకప్ అయిపోతుంది. వీరిలో నయనతార ముందుంటుంది. తన ప్రేమ వ్యవహారాలతో తరచూ వార్తల్లో నిలిచే నయన్ బ్రేకప్ చెప్పడానికి గల కారణాలను వివరించింది.

”ప్రేమలో ఉన్న ఇద్దరికీ చిన్న అపార్ధాలు వస్తే భరించొచ్చు. కానీ భరించలేనంతగా వస్తే విడిపోవడమే మంచిది. ప్రేమలో ఉన్నపుడు నాకు అలాంటి అనుభవమే ఎదురైతే విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఓ దశలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమవుదామనుకున్నా. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమేనన్న విషయం అవతలి వ్యక్తికి తెలియజేయాలని ఆ నిర్ణయం తీసుకున్నాను. కానీ నా జీవితంలో నేను అనుకున్నట్లుగా ఏది జరగట్లేదు. అందుకే ప్రస్తుతం పెళ్ళి గురించి ఆలోచింట్లేదని” వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus