హీరోలు, హీరోయిన్లు కొన్ని సినిమా కథలను రిజెక్ట్ చేసి ఆ సినిమాలు హిట్టయ్యాక బాధ పడిన ఘటనలు గతంలో చాలా ఉన్నాయి. మంచి కథలను వేర్వేరు కారణాల వల్ల రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమా మిస్సైనందుకు తాజాగా మలయాళ నటి పార్వతీ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేక ఈ బ్యూటీ అర్జున్ రెడ్డి కథను మిస్సయ్యారని చెప్పవచ్చు.
అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఆమె అర్జున్ రెడ్డి సినిమాకు నో చెప్పారని తెలుస్తోంది. ఇన్ స్టాగ్రామ్ చాట్ సెషన్ లో అర్జున్ రెడ్డిని మిస్ చేసుకున్నందుకు బాధ పడుతున్నారా అని ఒక అభిమాని అడగగా పార్వతీ నాయర్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఆ సినిమాను మిస్ చేసుకుని ఉండకూడదని తనకు నిజంగా చాలా బాధగా ఉందని పార్వతీ నాయర్ వెల్లడించడం గమనార్హం.
అయితే అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారు. అర్జున్ రెడ్డి సినిమా మిస్సైనా అలాంటి అందమైన సినిమాలు మళ్లీ వస్తాయని పార్వతీ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు మాత్రం పార్వతీ నాయర్ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పార్వతీ నాయర్ ఎన్నై అరింధాల్, ఉత్తమ విలన్ సినిమాల్లో నటించగా ఆ సినిమాల వల్ల ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు.