కొంతమంది హీరోయిన్లు చూడడానికి ఎంత చక్కగా ఉన్నా.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉన్నా.. నటనతో కూడా ఆకట్టుకున్నా.. ఎందుకో తరువాత వాళ్లకు టైం కలిసి రాదు. దీనికి ఉదాహరణగా పూనమ్ బజ్వా పేరు చెప్పుకోవచ్చు. ‘మొదటి సినిమా’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూనమ్ బజ్వా.. గ్లామర్ తో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. అయితే తరువాత ఈమె గ్లామర్ కు.. నటనకు తగిన సినిమా పడలేదు. నాగార్జున ‘బాస్’ , ‘వేడుక’, ‘పరుగు’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి చిత్రాల్లో నటించింది కానీ..
అవేమీ ఈమెకు కలిసి రాలేదు. అయితే తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలో మాత్రం ఈమె మంచి క్రేజ్ నే సంపాదించుకుంది.ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్ లోనే ఉంటూ వస్తోన్న ఈ బ్యూటీ తాజాగా.. తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి అందరికీ పెద్ద షాకిచ్చింది.ఇతని బాయ్ ఫ్రెండ్ పేరు సునీల్ రెడ్డి అట. ఈరోజు అతని పుట్టినరోజు కావడంతో పూనమ్..అతనికి బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు..
అతనితో కలిసున్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసి.. ఈమె అభిమానులకు షాకిచ్చింది.సునీల్ తో పూనమ్ స్విమ్మింగ్ ఫూల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అలాగే అతన్ని కిస్ చేస్తున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.