Poonam Kaur: బీచ్ లో బికినీ వేసుకొని తిరుగుతా.. నటి కామెంట్స్ వైరల్!

నటి పూనమ్ కౌర్ ఈమె నటిగా సినిమాలలో కన్నా వివాదాల ద్వారానే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా తెలుగులో అడపాదడపా సినిమాలలో నటించిన ఈమె సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించుకోలేకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టుల కారణంగా ఎంతో గుర్తింపు పొందారు.అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేస్తుందో కూడా తెలియకుండా వివాదానికి తెరలేపుతుంటారు. కొన్నిసార్లు ఈమె చేస్తున్న పోస్ట్ వెంటనే డిలీట్ చేస్తూ.. చర్చలకు తావిస్తుంటారు.

ఏది ఏమైనా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పూనమ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా మహిళల వస్త్రధారణ గురించి అసభ్యంగా మాట్లాడే వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పింది.సాధారణంగా ఎంతోమంది మహిళలు వేసుకుని వస్త్రధారణ కారణంగానే సమాజంలో లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఈ విధంగా మహిళలు ధరించే వస్త్రధారణలో మార్పు రావాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇలా మహిళల వస్త్రధారణ వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్న విషయంపై ఈమె స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.

ముందుగా ఈ విషయం గురించి మాట్లాడేవారు నిండుగా దుస్తులు ధరించిన మహిళలపైనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించాలి అంటూ ఈమె చెప్పుకొచ్చారు. నేను కూడా నాకు నచ్చిన విధంగా నాకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరిస్తాను. నేను బురుఖ వేసుకుంటాను, చీర కట్టుకుంటాను అలాగే బీచ్ కి వెళ్తే బికినీ వేసుకుంటాను.

మీకు లిమిట్స్ క్రాస్ చేస్తే హక్కు లేదు… నేను ధరించే దుస్తులలో నాకు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను అంటూ ఈమె కామెంట్ చేశారు. ఇలా దుస్తుల వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయన్నడం పూర్తిగా తప్పంటూ ఈ సందర్భంగా ఈమె ట్రోలర్స్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus