‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ మంచి ఆఫర్ లు అందుకుంటున్నారు. అందులో ప్రణీత పట్నాయక్ కూడా ఒకరు. ఈమె ‘ఉప్పెన’ ‘పంచతంత్ర కథలు’ ‘నెట్’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.’నెట్’ సినిమాలో ఈమె రాహుల్ రామకృష్ణ భార్యగా కనిపించింది. అందులో ఓ ఇంటిమేట్ సీన్లో కూడా చాలా బోల్డ్ గా నటించింది. అయితే ‘సీతా రామం’ సినిమాలో పోషించిన రాధిక పాత్ర ప్రణీతకి నటిగా మంచి గుర్తింపు తెచ్చిందనే చెప్పాలి.
ఇందులో ఈమె వేశ్యగా కనిపించినప్పటికీ దర్శకుడు హను రాఘవపూడి ఈ పాత్రను చాలా సెన్సిబుల్ గా తీర్చిదిద్దాడు. ఇదిలా ఉండగా.. ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి: