Priyanka Chopra: ప్రియాంక చోప్రా కొత్త ఫొటో వైరల్‌… చూశారా!

పెళ్లైన తర్వాత ప్రియాంక చోప్రా… బాలీవుడ్‌కి దూరంగా ఉంటోంది. ఈ మధ్య ఏదో సినిమా ఒకటి ఒప్పుకున్నట్లుంది. ఎక్కువగా హాలీవుడ్‌ సినిమాలు, షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అయితే కాస్త సమయం చిక్కినా… భర్త నిక్‌ జొనాస్‌తో కలసి ట్రిప్‌లు వేసేస్తోంది. అక్కడితో ఆగకుండా… అక్కడ దిగిన హాట్‌ హాట్‌ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ కుర్రకారు హార్ట్‌ బీట్‌ను పెంచుతోంది. తాజాగా టూ పీస్‌ బికినీతో రెండు ఫొటోలను షేర్‌ చేసింది. అది కామన్‌ కావొచ్చు కానీ… దానికి పెట్టిన క్యాప్షనే ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

‘ఓరోరి యోగి నన్ను కొరికేయ్‌రో…’ అనే పాట గుర్తుందా? ఆ మధ్య ‘యోగి’ సినిమాలో ముమైత్‌ ఖాన్‌ ఆడిపాడిన పాట. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా ‘ఓరోరి నిక్‌ నన్ను కొరికేయ్‌రో..’ అన్నట్లుగా క్యాప్షన్‌ పెట్టింది. టూ పీస్‌ బికినీలో తను వెల్లకిలా పడుకొని ఉంటే… నిక్‌ జొనాస్‌ తనను స్పూన్‌, ఫోర్క్‌తో స్నాక్స్‌ లాగా తింటున్నాడు అనే అర్థం వచ్చేలా ఆ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో రాసుకొచ్చింది ప్రియాంక చోప్రా.

మరో పోస్టులో ప్రియాంక టూ పీస్‌ బికినీ వేరే యాంగిల్‌ ఫొటో షేర్‌ చేస్తే… దాని కింద నిక్‌ జొనాస్‌ ‘యమ్మీ’ అంటూ కామెంట్‌ పెట్టడం గమనార్హం. మరోవైపు ఈ పోస్టులో ప్రియాంక సోదరి పరిణీతి చోప్రా కూడా కామెంట్లు ‘కళ్లు మూసుకొని లైక్‌ కొట్టేయడమే’ అంటూ పెట్టింది. ఇదంతా చూస్తుంటే… ప్రియాంక టూ నాటీ అనిపిస్తోంది. మరోవైపు ఈ ‘సోషల్‌ షో’ ఎందుకు అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఏదైతేముంది కుర్రాళ్లకు నయనానందం.

1

2

 

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus