2020 అందరి జీవితాలను కుదిపేసిన సంవత్సరం. అన్ని రంగాలు కూడా 2020లో బాగా దెబ్బ తినేసాయి. కరోనా మహమ్మారి ఎంటర్ అవ్వడం..లాక్ డౌన్ పడటం.. ఎంతో మంది దిగ్గజాలను తీసుకుపోవడం.. వంటివి చూసాం. అంతేకాదు వరదలు వంటివి కూడా రావడం మనం చూస్తూనే వచ్చాము. ఇదిలా ఉండగా.. ఓ హీరోయిన్ మాత్రం ప్రత్యేకంగా ఇది నా జీవితంలో అత్యంత బ్యాడ్ ఇయర్ అంటుంది. ఆమె మరెవరో కాదు రాయ్ లక్ష్మీ.
కెరీర్ ప్రారంభంలో తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. అటు తరువాత కోలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేసింది. అయినప్పటికీ అక్కడ ఈమె క్లిక్ అవ్వలేదు. ఓ రేంజ్లో గ్లామర్ షో చేసినప్పటికీ ఈమె అక్కడ క్లిక్ అవ్వలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రాయ్ లక్ష్మీ మాట్లాడుతూ.. “అందరి జీవితాల్లోనూ కష్టాలు వస్తాయి. కన్నీళ్లతో కుమిలిపోతున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి.. అయితే..
2020 సంవత్సరం మొత్తం నాకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ఏడాది నుండీ ఎన్నో కష్టాలు, నష్టాలను చవి చూసాను. లాక్ డౌన్ టైములో నాలుగు గోడలకే పరిమితమవ్వడం ఒక కారణం అయితే.. అదే టైములో నా తండ్రి అనారోగ్యం పాలవ్వడం … ఆయన గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ మరణించడం నన్ను చాలా కృంగదీసింది” అంటూ చెప్పుకొచ్చింది. ఆ టైములో ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడినట్టు కూడా ఈమె చెప్పుకొచ్చింది.