టీమిండియా సారథి మహేంద్రసింగ్ ధోనీతో డేటింగ్ చేసింది నిజమే, కానీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని హీరోయిన్ రాయ్ లక్ష్మి పేర్కొంది. ధోనీ జీవిత కథ ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ.. ద అన్ టోల్డ్ స్టోరీ’ పేరుతో సినిమా విడుదల కానున్న నేపధ్యంలో… లక్ష్మి రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ముంబై మీడియాలో ప్రధానంగా హల్చల్ చేస్తున్నాయి.
ఒకానొక సమయంలో ధోనీ – రాయ్ లక్ష్మి మధ్య నడిచిన వ్యవహారం ఈ సినిమాలో ఉంటుందా? లేదా? అన్న విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.