ఆ రూమర్లకు చెక్ పెట్టిన రాశి… మ్యాటర్ ఏంటంటే…!

సీనియర్ స్టార్ హీరోయిన్ రాశీ .. గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలనటిగా విజయ పేరుతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాశీ.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల సినిమాల్లో కూడా నటించింది. జగపతి బాబు ‘పెళ్లి పందిరి’ సినిమాతో ఈమె రాశీ గా మారింది. అంతేకాదు కంప్లీట్ హీరోయిన్ గా కూడా మారిందనే చెప్పాలి. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ‘గోకులంలో సీత’ సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది రాశి. ఇక ‘శుభాకాంక్షలు’ ‘ప్రేయసి రావే’ ‘స్నేహితులు’ వంటి సినిమాలు ఈమె స్థాయిని మరింత పెంచాయి. తరువాత కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు డిమాండ్ తగ్గింది.

కాబట్టి గౌరవ ప్రథమంగానే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక పెళ్ళైన తరువాత రాశి నటించిన సినిమాలు చాలా తక్కువే. ఈ మధ్య కాలంలో ఈమె గురించి రక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఈమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అందుకే సినిమాల్లో నటిస్తుంది అంటూ కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి. వాటిని రాశీ ఖండించి క్లారిటీ ఇచ్చింది. అదంతా ఫేక్ న్యూస్ అని తేల్చేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల రాశీ ఎడమ కన్నుకి అలాగే ముక్కుకి ఏదో ప్రాబ్లం వచ్చింది అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి. వీటి పై రాశీ స్పందించింది. ఆమె మాట్లాడుతూ…”నేను హీరోయిన్ గా చేసిన సినిమాల్లో చూసి.. ఇప్పుడు నా ఎడమ కన్ను, ముక్కు ఏదో తేడాగా ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి.

సినిమా సెట్స్ లో ఉండే మేకోవర్ కు, ఇంట్లో లుక్ కు చాలా తేడా ఉంటుంది. అక్కడ లైటింగ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. షూటింగ్ లో పాల్గొనే సమయంలో వంట చేసుకోవడం వంటి పనులు ఉండవు. కాబట్టి బాగా నిద్రపోయేదాన్ని. అయితే ఇప్పుడు అలా కాదు. ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి. పైగా ‘శుభాకాంక్షలు’ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. వయసు పెరిగింది కాబట్టి.. అందువల్ల వచ్చిన మార్పులు కావొచ్చు. ఇక నా ముక్కు అంటారా..! సినిమాల్లో నటించేప్పుడు నాకు ముక్కు పుడక వుండేది కాదు.. కానీ మా పాప పుట్టిన తరువాత పెట్టించుకున్నాను. అందువల్ల అది కూడా తేడాగా కనిపిస్తుంది అనుకుంట” అంటూ చెప్పుకొచ్చింది రాశీ.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus