Raasi: పవన్ కళ్యాణ్ అసలు క్యారెక్టర్ అది.. అంటూ సీనియర్ హీరోయిన్ రాశీ కామెంట్స్ వైరల్

సీనియర్ నటి రాశి అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. తర్వాత తెలుగుతో పాటు తమిళ,మలయాళం,కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ‘పెళ్లి పందిరి’ ‘గోకులంలో సీత’ ‘శుభాకాంక్షలు’ ‘మనసిచ్చి చూడు’ ‘ప్రేయసి రావే’ ‘స్నేహితులు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓ పక్క ఇల్లాలి పాత్రలు చేస్తూనే మరోపక్క గ్లామర్ రోల్స్ కూడా చేసింది ఈమె. తమిళంలో విజయ్ వంటి స్టార్ హీరో సరసన కూడా నటించి అక్కడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

ఇక కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. 2003 తర్వాత (Raasi) రాశికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ప్రస్తుతం అయితే ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తూ వస్తోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. రాశీ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. “నా కూతురు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిద్దాం అని ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ లొకేషన్ కి వెళ్లాను.

నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు. కాబట్టి నేను కారులోనే ఉండి.. మా డ్రైవర్ తో ఈ విషయం చెప్పి రమ్మన్నాను. అప్పుడు ఆయన ‘ఇంతసేపు ఆమెను వెయిట్ చేయించామా. వెంటనే ఇక్కడికి పిలుచుకుని రా..’ అంటూ చెప్పారు.

తర్వాత నేను వెళ్లగా నాకు నమస్కరించి 20 నిమిషాల పాటు ‘గోకులంలో సీత’ సినిమా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని.. నన్ను కారు వరకు తీసుకెళ్లి ఎక్కించి వెళ్లారు. అది పవన్ కళ్యాణ్ సంస్కారం. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా.. ఒదిగి ఉండే గుణం ఆయనది’ అంటూ రాశీ చెప్పుకొచ్చారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus