సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న రాశి ప్రేమ కథ..!

90లలో హీరోయిన్ రాశి అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పక్కింటి అమ్మాయిలా అనిపించే రాశికి అప్పట్లో సూపర్ క్రేజ్ ఉండేది. టూ టైర్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఆమె అందరితో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన తెలుగు అమ్మాయి రాశి హిందీ, తమిళ్ పరిశ్రమలతో పాటు కన్నడ , మలయాళ చిత్రాలలో కూడా నటించింది. మరి ఇంతటి స్టార్ డమ్, దశాబ్దాల కెరీర్ కలిగిన రాశి ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంది అంటే నమ్ముతారా? కానీ రాశి ప్రేమ కోసం అదే చేసింది.

అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా పలు పరిశ్రమలలో నటించిన రాశి తండ్రి కోరిక మేరకు హీరోయిన్ అయ్యారు. 80లలో అనేక చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. బాలీవుడ్ లో కూడా రాశి సినిమాలు చేయడం విశేషం. కాగా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలోనే రాశి అనూహ్యంగా శ్రీముని అనే ఓ సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ ని వివాహం చేసుకున్నారు. పారిశ్రామిక వేత్తలు, సెలెబ్రిటీలు రాశిని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు.

ఐనా రాశి వారందరినీ కాదని శ్రీముని ని చేసుకున్నారు. తండ్రి మరణం తరువాత తన ఇబ్బందులను శ్రీమునితో రాశి పంచుకొనేవారట. అదే క్రమంలో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. రాశి స్వయంగా శ్రీమునికి ప్రపోజ్ చేశారట. వీరిద్దరికీ ఓ పాప ఉన్నారు.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus