ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ (Radha) నాయర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 80లలో సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించేసింది ఈ అమ్మడు. కృష్ణ శోభన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. రాధ అందంతో పాటు డాన్స్ తో కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకునేది. అందుకే ఈమె తొందరగా స్టార్ హీరోయిన్ అవ్వగలిగింది. . అటు తర్వాత పాలిటిక్స్‌లో తన హవా చూపించింది ఈ అమ్మడు.
సోషల్ మీడియాలో ఈ సీనియర్ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో ఆమె బికినీతో ఉన్న ఓ ఫోటోని షేర్ చేయడం విశేషం. కమల్ హాసన్ హీరోగా 1981 తెరకెక్కిన ‘టిక్ టిక్ టిక్’ మూవీలో రాధ బికినీ ధరించడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోనే ఈమె షేర్ చేసింది. అందులో స్వప్న, మాధవి వంటి నటీమణులు కూడా ఉన్నారు.
ఆ ఫోటో పై రాధ స్పందిస్తూ.. ” బికినీ వేసుకుని సెట్లోకి వెళ్లడం ఒక పోరాటంగా అనిపించింది.అప్పట్లో అది ఉద్యోగంలో భాగమని సరిపెట్టుకున్నాం. కానీ ఆ క్షణం మాకు ఒక యుగంలా గడిచింది. దీనికి చాలా బలం, పోరాటం అవసరమని భావించాం. ఏదేమైనా బికినీ ధరించినందుకు మాపై ప్రశంసల వర్షం కురిసింది.
‘టిక్ టిక్ టిక్’ సినిమా షూటింగ్లో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన సాహసం,పొందిన శక్తి’ గుర్తు చేసుకుని గర్వించగలుగుతున్నాం.” అంటూ బోల్డ్ గా చెప్పుకొచ్చింది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?