Radhika: పేరు చెప్పకుండా సినిమాను తిట్టిన రాధిక… మీకేమైనా తెలుసా?

  • January 27, 2024 / 08:46 PM IST

ఎవరైనా ఒక మనిషిని తిట్టినప్పుడు కచ్చితంగా పేరు చెప్పే తిట్టాలి. లేదంటే ఎవరికి వారు అది వాళ్ల కోసమో, వీళ్ల కోసమో అనుకుంటారు. అలానే ఏదైనా సినిమాను తిట్టినప్పుడు కూడా కచ్చితంగా పేరు చెప్పాలి. లేదంటే ఎవరికి నచ్చిన సినిమాను వాళ్లు అనుకుని ఫలానా మనిషి ఫలానా సినిమా మీద కామెంట్‌ చేశారు, అసలు అలా ఎందుకు అన్నారు అంటూ నానా చర్చలు మొదలవుతాయి. ఇప్పుడు ఇలాంటి చర్చకే దారి తీసింది ప్రముఖ నటి రాధిక చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌.

ఒక సినిమాపై అసహనం వ్యక్తం చేస్తూ రాధిక శరత్‌కుమార్‌ తాజాగా ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఏదైనా సినిమా చూసి విసిగిపోయారా? నాకు అయితే ఆ సినిమాను మధ్యలోనే ఆపేయాలనిపించింది. చాలా కోపం వచ్చింది అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఏ సినిమాను ఆమె అలా అన్నారు అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ ఆ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రీసెంట్‌ ఓటీటీ రిలీజ్‌ల్లో పెద్ద సినిమా ‘యానిమల్‌’ కాబట్టి దాని గురించే అని లెక్కలేసేస్తున్నారు నెటిజన్లు.

కొంతమంది నెటిజన్లు అయితే ‘‘మీరు మాట్లాడుతున్నది ‘యానిమల్‌’ సినిమా గురించే కదా’’ అని కామెంట్స్‌లో అడిగేశారు. మరికొందరైతే ‘‘ఆ సినిమా ‘సలార్‌’ అయి ఉండొచ్చు’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే రాధిక చేసిన ట్వీట్‌లో క్రింజ్‌ అనే పదం ఉంది. ఈ పదం ‘భోళా శంకర్‌’ సినిమా వచ్చినప్పుడు ఎక్కువగా చర్చలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను రాధిక చూసే పరిస్థితి లేదు. కాబట్టి రీసెంట్‌ రిలీజ్‌ల్లోనే ఓ సినిమా గురించి రాధిక (Radhika) అన్నారని చెప్పొచ్చు.

‘యానిమల్‌’లో కానీ, ‘సలార్‌’లో కానీ కొన్ని సన్నివేశాలను సగటు సమాజానికి చాలా దూరంగా ఉంటాయి. అయితే థియేటర్లలో మాస్‌ అభిమానుల మధ్యలో అదరగొట్టాయి. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాయి. అయినా ఇన్ని ప్రశ్నలు రేకెత్తించే బదులు రాధిక ఆ సినిమా పేరు కూడా చెప్పేసుంటే బాగుండేది. ఈ చర్చ ఉండేది కాదు. చూద్దాం పోస్ట్‌ కింద కామెంట్స్‌ చూసి ఏమన్నా చెబుతారేమో.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus