Rakul Preet: సమ్మర్ ఔట్​ఫిట్​లో అలాడిస్తున్న రకుల్..వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • May 21, 2024 / 07:36 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ (Rakul Preet) గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ పరిచయమైన రకుల్.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (Venkatadri Express) సినిమాతో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ‘లౌక్యం’ (Loukyam), ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho) , ‘ధృవ’ (Dhruva) , సరైనోడు (Sarrainodu) , జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ తెలుగులోనే కాకుండా కన్నడ , హిందీ తమిళంలో కూడా నటించి మంచి విజయాలు అందుకుంది.

రకుల్ ప్రీత్ చివరిగా తెలుగులో కొండపోలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఈ బ్యూటీ ఇటీవల హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షో చేయడానికి రకుల్ వెనకాడడం లేదు. తను లుక్స్​ని అలాగే మెయింటైన్ చేస్తూ ఫోటోషూట్​లు చేస్తుంది. తాజాగా సమ్మర్ స్పెషల్ ఔట్​ఫిట్​లో ఈ వయ్యారి భామ చాలా గ్లామరెస్​గా కనిపించింది. ఈ గ్లామరస్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus