Raashi: స్టార్ హీరో ప్రభాస్ గొప్పదనం ఇదే.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రాశి ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా క్రేజ్ ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. రాశి పలు సీరియళ్లలో సైతం నటిస్తుండగా ఆ సీరియళ్లు మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా హీరోయిన్ రాశి ప్రభాస్ గొప్పదనం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక సందర్భంలో రాశి మాట్లాడుతూ ఈ జనరేషన్ హీరోలలో ప్రభాస్ అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు.

ప్రభాస్ సినిమాలో నటించాలని తాను ఆశ పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ కు జోడీగా నటించాలని నాకు ఉందని ప్రభాస్ కు తల్లి రోల్ లో నటించాలని కోరితే మాత్రం తాను అస్సలు చేయనని ఆమె చెప్పుకొచ్చారు. ఈశ్వర్ మూవీ ట్రైలర్ చూసిన సమయంలో ప్రభాస్ పై ఇష్టం మొదలైందని రాశి చెప్పుకొచ్చారు. ప్రభాస్ అడవి రాముడు మూవీ షూట్ జరుగుతున్న సమయంలో ఆయన ఉన్న హోటల్ లోనే నేను కూడా ఉన్నానని రాశి వెల్లడించారు.

ప్రభాస్ ను కలవలేకపోయినా ఆయనతో ఫోన్ లో మాట్లాడానని రాశి అన్నారు. వర్షం సినిమా బాగుందని మీరు కూడా బాగున్నారని ప్రభాస్ తో చెప్పానని రాశి కామెంట్లు చేశారు. ప్రభాస్ ఫోన్ లో మర్యాదగా థ్యాంక్స్ అని చెప్పారని రాశి అన్నారు. రాశి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ప్రభాస్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో రాశికి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. రాశి పారితోషికం కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

రాశికి (Raashi) క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. రాశి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాశికి ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. పలు సినిమాలలో రాశి బోల్డ్ రోల్స్ లో నటించారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus