Samantha: హాట్ టాపిక్ గా మారిన సమంత ఎమోషనల్ పోస్ట్!

సమంత నటించిన యశోద మూవీ నిన్న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఫ్యామిలీ మెన్ సిరీస్ చూడని వారికి కొత్త సమంతని చూసిన ఫీలింగ్ ను కలిగిస్తుంది అనే చెప్పాలి.ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సమంత ఔరా అనిపించింది. యశోద షూటింగ్ టైంలో సమంతకి మయోసిస్ అనే వ్యాధి సోకింది.ఆ వ్యాధి వల్లే సమంత ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఈ వ్యాధి సోకిన వాళ్లకు మోకాళ్ళ నొప్పులు, ఎక్కువగా తలనొప్పి, నీరసం ఉండడం వల్ల ఎక్కువగా నిలబడలేరు.

అయినప్పటికీ సమంత యశోద లో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ఇందుకు కారణం తన ఫిట్ నెస్ ట్రైనర్ అని చెబుతూ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది సమంత. ఆ ట్రైనర్ పేరు జునైద్ షేక్. నేను నీరసంగా బలహీనంగా ఉన్నప్పటికీ నాకు థెరపీలు చేయించి జిమ్ లో ప్రాక్టీస్ లు చేయించేవాడు. అతని వల్లే నేను ఇలా మారగలిగాను.

అందుకు నీకు థాంక్స్ అంటూ ఆమె పేర్కొంది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతే కాదు సమంత జిమ్ లో వర్కౌట్ లు చేసిన వీడియోని కూడా పోస్ట్ చేసి చేతికి సెలైన్ బాటిల్ ఉన్నప్పటికీ ఆమె జిమ్ లో వర్కౌట్ లు చేయడం షాకిచ్చే అంశం.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus