హీరోయిన్ సనా ఖాన్ రహస్య వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ నటీనటులలో చాలా మంది ఈ కరోనా టైములో పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిఖిల్, నితిన్, దిల్ రాజు(రెండో పెళ్లి), ‘రంగస్థలం’ మహేష్,కృష్ణ అండ్ హిజ్ లీల ఫేమ్ షాలిని, దగ్గుబాటి రానా, కాజల్, వంటి వారు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూడా జాయిన్ అయ్యింది. అయితే ఈమె అందరిలా కాకుండా చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనేగా మీ డౌట్?ఈమె పేరు సనా ఖాన్.

గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘కళ్యాణ్ రామ్ కత్తి’ అలాగే మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ నూకయ్య’ చిత్రాలతో ఈమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అంతేకాదు నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన ‘గగనం’ చిత్రంలో కూడా ఈమె ఓ నటించింది. అయితే తెలుగులో ఈమె హీరోయిన్ గా రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ కు వెళ్లి అక్కడ పలు సినిమాల్లో నటించి గ్లామర్ షో చేసినా ఫలితం లేకపోయింది. సరే ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడితే బెటర్ అని ఫిక్స్ అయ్యి…పెళ్లి చేసేసుకుంది.

2019 ఫిబ్రవరిలో మెల్విన్ అనే కొరియోగ్రాఫర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ప్రకటించిన సనా..2020 ఆరంభంలో అతడికి బ్రేకప్ చెప్పేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే..తాజాగా ఈ బ్యూటీ గుజరాతీ వ్యాపారవేత్త ముఫ్తీ అన్నాస్‌ ను సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుంది.కొద్దిరోజులుగా ఇతనితో ప్రేమలో ఉందని గాసిప్ లు వినిపించిన సంగతి తెలిసిందే.అది నిజమే అని ఈ పెళ్లితో కన్ఫర్మ్ అయ్యింది. వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారని సమాచారం.

1

2

3

4

5

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus