పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా రూపొందింది. ఏ.ఎం.రత్నం దీనికి నిర్మాత. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా.. ఆ తర్వాత ఏ.ఎం.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ టేకప్ చేశారు. అనేక ప్రతికూల పరిస్థితుల నడుమ ఈ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేశారు. మరో రకంగా ఈ ప్రాజెక్టుని వదిలించుకున్నారు అనుకోవాలి. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని ముందుగా అనౌన్స్ చేసినప్పటికీ.. అది సాధ్యమయ్యే అవకాశం లేదు.
మొదటి భాగానికే నిర్మాత చాలా నష్టపోయారు. అవి అతను ఎప్పటికి తీర్చుకోవాలి. అయితే ఈ ప్రాజెక్టుపై హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఆమెకు దొరికిన మొదటి పెద్ద ప్రాజెక్టు ఇది. ఈ సినిమా కోసం దాదాపు 3 ఏళ్ళు ఎదురుచూసింది. సినిమా ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంది.ఈమె కష్టం చూసే హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. కదిలి వచ్చి ప్రమోషన్ చేశారు.
దాని వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఒక రకంగా నిధి వల్లే ‘హరిహర వీరమల్లు’ కి మేలు చేకూరింది అని చెప్పాలి. అయితే ఈమె పై చిత్రీకరించిన చాలా పోర్షన్ సెకండ్ పార్ట్ కోసం దాచి ఉంచారు. కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చే అవకాశం లేదు. ఆ రకంగా చూస్తే నిధికి అన్యాయం జరిగినట్టే. అందుకే ఆమె ‘రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్ ‘ ‘హరిహర వీరమల్లు’ గురించి ప్రశ్న ఎదురైతే.. ‘ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు మాట్లాడతా’ అని సేఫ్ ఆన్సర్ ఇచ్చి దాటేస్తుంది.