సెలబ్రిటీల విడాకుల వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే..! ఈ మధ్య విడాకులు తీసుకునే సెలబ్రిటీలు కూడా ఎక్కువవడం అందరికీ షాకిచ్చే అంశం. అయితే ఈ మధ్య విడాకులు అన్నీ ఒక ఫార్మేట్లో నడుస్తున్నాయి.
విడాకులు తీసుకునే సినీ సెలబ్రిటీలు ముందుగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో తమ పర్సనల్ ఫోటోలు, పెళ్లి ఫోటోలు డిలీట్ చేస్తున్నారు. లేదంటే.. తమ ఖాతా పేరులో ఉన్న తమ పార్ట్నర్ పేరును మార్చుకుంటున్నారు. ఇలా చేస్తే చాలు.. విడాకుల వార్తలు కన్ఫర్మ్ అయిపోయినట్టే అనేది నెటిజన్ల నమ్మకం. చాలా మంది సెలబ్రిటీల విషయంలో ఇది నిజం అయ్యింది కూడా. నాగ చైతన్య – సమంత, ధనుష్ – ఐశ్వర్య.. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. తాజాగా ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా చేరినట్టు టాక్ ప్రచారం జరుగుతుంది.
తన ఇన్స్టాగ్రామ్ లో సంగీత క్రిష్ అనే పేరును సంగీతగా మార్చేసుకుంది.. సో ఆమె కూడా తన భర్తతో విడాకులు తీసుకోనుంది అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై సంగీత స్పందించి క్లారిటీ ఇచ్చింది.ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ‘నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే నేను భావిస్తాను. కానీ మీ చేష్టలకు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. నేను నా భర్తతో సంతోషంగా ఉన్నాను. మొదటి నుండి నా సోషల్ మీడియా ఖాతాల్లో ‘యాక్టర్ సంగీత’ అనే ఉంటుంది. ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపండి’ అంటూ వెల్లడించారు సంగీత.