సినీ తారల వ్యక్తిగత జీవితాలు తెరిచిన పుస్తకం లాంటివి. ఇప్పుడు సోషల్ మీడియా రాకతో అన్ని విషయాలు జనానికి తెలిసిపోతున్నాయి. అయినప్పటికీ ఇంకా తెలుసుకోవాలనే ఆత్రుతతో కొందరు ఓవరాక్షన్ చేస్తున్నారు. చాలా మంది హీరో హీరోయిన్లకు రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి, నేటికీ అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే బయటకు తెలుస్తున్నాయి. తమ గత వివాహాలకు సంబంధించిన రహస్యాలు బయటకు రాకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. అవి ఎలాగోలా బహిర్గతమవుతాయి. ఇలాంటి వాటిలో ఒకటి అలనాటి హీరోయిన్ సంఘవి మొదటి వివాహం.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అగ్రనటిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు సంఘవి. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన ఈమె అసలు పేరు కావ్య . ఈమె తండ్రి పేరున్న డాక్టర్ కాగా.. తల్లి సాధారణ గృహిణి. అయితే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానన్న మాట సంఘవి విషయంలోనూ జరిగింది. తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ చేయాలని భావించారు. అయితే సంఘవిని డ్యాన్స్ నేర్చుకోవడం కోసం పంపగా.. ఆమె స్టెప్పులను చూసి ఆశ్చర్యపోయిన దర్శకుడు సెల్వ ఆమెను హీరోయిన్ ను చేశారు.
దాదాపు 23 సంవత్సరాల పాటు సంఘవి హీరోయిన్ గా రాణించారు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్ మహాల్ తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఆమెకు సూర్యవంశంతో మంచి పేరు వచ్చింది. కెరీర్ అప్పుడప్పుడే ఊపందుకుంటున్న దశలో 1998లో శివయ్య సినిమాలో నటిస్తుండగా ఆ చిత్ర దర్శకుడు సురేశ్ వర్మతో ప్రేమలో పడి ఆయననే పెళ్లాడారు.
అయితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను పెళ్లాడారు సంఘవి. 42 ఏళ్ల వయసులో ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!