‘బాలు’ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు… ‘జీవితం ఎప్పుడూ పూల పాన్పులా ఉండదు.. ఇక్కడ కష్టం అనుభవించడం.. దానిని జయించడం కూడా నేర్చుకోవాలి’. ఇది చాలా వరకూ అందరూ ఫాలో అయ్యేదే. అయితే కొంతమంది మాత్రం అన్నిటినీ అంత ఈజీగా తీసుకోలేరు. అందుకే డిప్రెషన్ కు వెళ్లిపోతుంటారు.దాని నుండీ బయటపడలేక.. ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వంటి వారి జీవితాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈ ‘డిప్రెషన్’ అనే అంశం పై చాలా మంది నటులు, నటీమణులు తమ అభిప్రాయాలను తెలియజేసారు. అదే కోవలో ‘జెర్సీ’ నటి సనూష కూడా డిప్రెషన్ కు లోనయినట్టు చెప్పి.. దాని నుండీ ఎలా బయటపడింది కూడా తెలియజేసింది. ఆమె ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను కూడా.. నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మానసిక కుంగుబాటుకు, మనస్తాపానికి గురయ్యాను.ఈ క్రమంలో నాకు చాలా భయమేసింది.
ఒకానొక టైములో ఆ సిట్యుయేషన్ నుండీ బయటపడలేక ఆత్మహత్య చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యాను.తరువాత ఓ వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడంతో డిప్రెషన్ నుండీ బయటపడ్డాను” అంటూ చెప్పుకొచ్చింది. అయితే తన మానసిక పరిస్థితి గురించి చెప్పినందుకు ఈమె పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.కానీ ‘డిప్రెషన్ కు గురైన వాళ్ళకు ధైర్యం చెప్పి కోలుకోవాలనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేసినట్టు’ సర్దిచెప్పింది సనూష.
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!