Actress: విడాకులు తీసుకుంటున్నందుకు నటి ఆనందంతో ఫోటో షూట్!

  • May 2, 2023 / 02:55 PM IST

పెళ్లిళ్లకు.. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటూ ఫోటోలు తీయించుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. సెలబ్రిటీలు అయితే(నటీమణులు) బేబీ బంప్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇదే పెద్ద ట్రెండ్ అనుకుంటే ఇప్పుడు ఇంకో ట్రెండ్ వచ్చింది. అదే విడాకులు తీసుకోవడానికి కూడా ఫోటో షూట్లు చేసే ట్రెండ్.గత నెలలో లారెన్ బ్రూక్ అనే మహిళ విడాకుల కోసం ఓ ఫోటో షూట్లో పాల్గొంది. చాలా అందంగా రెడీ అయ్యి మరీ ఈ ఫొటో షూట్లో పాల్గొంది.

పెళ్లి దుస్తుల్ని, ఫొటోల్ని కాల్చి వేస్తూ… చాలా వివాదాస్పదంగా ఈ ఫోటో షూట్ పిక్స్ ఉన్నాయి అంటూ కామెంట్లు కూడా వినిపించాయి. ఈమెను ఆదర్శంగా తీసుకునో ఏమో కానీ తాజాగా..ఓ సీరియల్ నటి కూడా ఇలాంటి ఫోటో షూట్లో పాల్గొంది. వివరాల్లోకి వెళితే.. తమిళ సీరియల్స్ లో నటించే షాలిని ‘మల్లుమ్ మలరుమ్’ అనే సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది. సూపర్ మామ్ అనే టీవీ షో కూడా ఈమె ఇమేజ్ ను పెంచింది.

రియాజ్ అనే వ్యక్తిని (Actress) ఈమె పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే వీరికి ఓ పాప కూడా ఉంది. కొద్దిరోజుల క్రితం షామిలి తన భర్త పై సంచలన ఆరోపణలు చేసింది. తాను గృహహింసకి గురవుతున్నానని… ‘నా భర్త నన్ను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని’ షాకింగ్ కామెంట్లు చేసింది. దీంతో షాలిని- రియాజ్ లకు కోర్టు విడాకులు మంజూరు చేయడం జరిగింది. ఆ ఆనందాన్ని ఈమె ఇలా ఫోటో షూట్ తో వ్యక్తపరుస్తున్నట్టు తెలుస్తుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus