దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ డైరెక్ట్ చేసిన ‘జోష్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. నాగ చైతన్య డెబ్యూ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రియ ధన్వంతరి. ఆ చిత్రంలో కాలేజ్ గ్యాంగ్ లీడర్ అయిన రాధా(‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రె) గర్ల్ ఫ్రెండ్ గా ఈమె కనిపిస్తుంది. అటు తర్వాత సందీప్ కిషన్ ఓ హీరోగా నటించిన ‘స్నేహగీతం’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రం శ్రీయ ధన్వంతరికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ‘స్నేహగీతం’ లో ఎంతో సాంప్రదాయబద్ధమైన లుక్ తో ఈమె యువతను ఆకట్టుకుంది. అయినప్పటికీ తెలుగులో అవకాశాలు ఎక్కువ రాకపోవడంతో ముంబైకు చెక్కేసింది శ్రీయ ధన్వంతరి.అక్కడ పలు వెబ్ సిరీస్ లు, సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె మాట్లాడుతూ…స్టార్ హీరోల పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘అవార్డు ఫంక్షన్లలో స్టార్ హీరోలు ఏంటేంటో చెబుతుంటారు.
వారు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలే. కొంచెం కూడా నిజం అనేదే ఉండదు. వారి మాటల్లో కనిపించే నిజాయితీ… చేతల్లో కనిపించదు.హిట్టు వచ్చిన ఆనందంలోనో లేదా అవార్డు వచ్చిన ఆనందంలోనో.. లేదా ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చెయ్యాలనో కానీ.. తోటి నటీనటుల గురించి గొప్పగా చెబుతుంటారు.ఆ తరువాత వాళ్ళ మొహం కూడా చూడరు. నేను నటిగా నిలదొక్కుకోవడానికి తొమ్మిదేళ్ళు కష్టపడాల్సి వచ్చింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.