‘దేశముదురు’ తర్వాత అల్లు అర్జున్ సరైన హిట్టు అందుకోవడానికి చాలా టైం పట్టింది. ‘పరుగు’ బాగానే ఆడింది. కానీ ‘దేశముదురు’ అంత హిట్ కాదు. అటు తర్వాత చేసిన ‘ఆర్య 2’ ‘వరుడు’ ‘బద్రీనాథ్’ వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ‘వేదం’ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్న సినిమా కాదు. మరోపక్క రాంచరణ్ ‘మగధీర’ తో సూపర్ ఫామ్లోకి వచ్చాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇక నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం కష్టమే అనే కామెంట్స్ వినిపించాయి.
మరోపక్క అతని యాక్టింగ్ పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. రొటీన్ అని.. అల్లు అర్జున్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని.. ఇలా చాలా మంది ఆ టైంలో అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ సూపర్ డాన్సర్ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేశారు.
ఇలాంటి టైంలో అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ముందుకొచ్చారు. ఆ టైంలో ‘ఖలేజా’ తో త్రివిక్రమ్ కూడా ప్లాప్ చవి చూశారు. అయినప్పటికీ త్రివిక్రమ్ రైటింగ్ పై ఆడియన్స్ కి నమ్మకం ఉంది.
కానీ ‘ఖలేజా’ తర్వాత వెంకటేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. దీంతో ‘జులాయి’ చేసి హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు త్రివిక్రమ్. అయితే ఈ కథని ముందుగా రామ్ కోసం అనుకున్నాడట త్రివిక్రమ్. రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ కి కూడా త్రివిక్రమ్ కథ వినిపించారు. కానీ రామ్ ఆ టైంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల.. డిలే అయ్యే ఛాన్స్ ఉందని భావించి అల్లు అర్జున్ తో ‘జులాయి’ కథని ముందుకు తీసుకెళ్లారు త్రివిక్రమ్. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ కు కంబ్యాక్ లభించింది. రామ్ కి ఓ మంచి సినిమా మిస్ అయినట్టు అయ్యింది. నేటితో ‘జులాయి’ రిలీజ్ అయ్యి 13 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 2012 ఆగస్టు 9న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.