కొడుకుతో కలిసి ‘బిగ్ బాస్’ శ్రీహాన్ తల్లిదండ్రులను కలిసొచ్చిన సిరి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘బిగ్ బాస్ 5’ లో సిరి బాయ్ ఫ్రెండ్ గా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు శ్రీహాన్. ఆ టైంలో అతను హోస్ట్ నాగార్జునతో కలిసి చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే సీజన్ 6 కు ఏకంగా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.శ్రీహాన్ కూడా ఓ యూట్యూబర్. అయినా కూడా ఎక్కువమందికి శ్రీహాన్ ఎవరో తెలీదు. అతనికి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి పేరొచ్చింది.

ఇక శ్రీహాన్.. సీజన్ 5 కంటెస్టెంట్ అయిన సిరికి కాబోయే భర్త అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్ళికి ముందే ఓ బాబుని దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇదిలా ఉండగా.. ఇటీవల సిరి హనుమంతు తన కొడుకుని తీసుకుని వైజాగ్ వెళ్లి శ్రీహాన్ తల్లిదండ్రులను అంటే ఆమెకు కాబోయే అత్త మామలను కలిసొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటున్నాడు.

చాలా కూల్ గా ఇతను గేమ్ ఆడే పద్ధతి ప్రేక్షకులకు నచ్చుతుంది. అయితే ఇతను హౌస్ లో ఎన్ని రోజులు కొనసాగుతాడు..? టాప్ 5 లో చోటు సంపాదించుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి సిరి లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!


ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus