Surekha Vani: సినిమాలకు దూరం కాలేదు.. అవకాశాలే రాలేదు: సురేఖ వాణి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి సురేఖ వాణి.ఈమె ఇదివరకు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో అక్క వదిన పిన్ని పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సురేఖ వాణి సినిమాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ విధంగా సురేఖ వాణి సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

సోషల్ మీడియా వేదికగా తన కూతురుతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా మామూలుగా ఉండదు.వీరిద్దరూ కలిసి చేసే కొన్ని వీడియోలు ఫోటోషూట్లకు నేటిజన్ల నుంచి విమర్శలు ఎదురైన డోంట్ కేర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఇకపోతే ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాలకు దూరం కావడంతో ఇకపై సురేఖ వాణి సినిమాలలో నటించరేమో అంటూ అభిమానులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె స్వాతి ముత్యం సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సురేఖవాణి సినిమాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. చాలామంది తను సినిమాలకు దూరమవుతున్నానని భావిస్తున్నారు. అయితే తాను సినిమాలకు దూరం కాలేదని, సినిమా అవకాశాలు తన వరకు వస్తేనే కదా తాను నటించడానికి అంటూ ఈమె వెల్లడించారు.తనకు సినిమా అవకాశాలు రాలేదని

ఇలా ఎందుకు జరుగుతుందో తనకు కూడా అర్థం కాలేదంటూ ఈ సందర్భంగా సురేఖ వాణి తనకు అవకాశాలు రాలేదని విషయాన్ని బయట పెట్టారు. తనకు సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని తెలియజేసిన సురేఖ వాణి తనకు స్వాతిముత్యం సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus