‘రెడీ’ సినిమాలో చిట్టినాయుడుని తిట్టి కొట్టే అమ్మ పాత్రలో, ‘దుబాయ్ శీను’ ‘పవర్’ చిత్రాలలో రవితేజకు అక్కలా నటించిన సురేఖా వాణి ను తెలియని వారంటూ ఉండరు. పలు చిత్రాల్లోనూ, టీవీ షోలతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సురేఖ . ప్రస్తుతం భర్త సురేష్ తేజ, కూతురుతో కలిసి హైదరాబాద్ లో జీవిస్తుంది. ఇదిలా ఉండగా ఈరోజు సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించాడట.
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ సోమవారం(ఈరోజు) నాడు ఉదయం మరణించాడని తెలుస్తుంది. సురేష్, సురేఖాలది ప్రేమ వివాహం. ఈమె టీవీ యాంకర్ గా ఉన్న రోజుల్లో ఇద్దరూ ప్రేమించి.. పెళ్ళి చేసుకున్నారు. సురేష్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. సురేష్ డైరెక్ట్ చేసిన ‘మాటాకీస్’ ‘హార్ట్ బీట్’ ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ వంటి షోలకు సురేఖా వాణి యాంకర్ గా చేసింది.