సౌత్‌లో విపరీతంగా పాపులారిటీ పొందిన తర్వాత నార్త్‌కు వెళ్లిన హీరోయిన్స్.. సౌత్ ఇండస్ట్రీ మీద కామెంట్స్ చేయడం కామన్‌గా మారిపోయింది. కొందరు హీరోయిన్స్ పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తే.. కొందరు మాత్రం నెగిటివ్‌గా కామెంట్ చేస్తారు. చాలావరకు బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తమ కెరీర్ ఎక్కడ ప్రారంభించామని మర్చిపోయి భామలు.. ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అందులో కొంతవరకు నిజాలే అయినా ప్రేక్షకులు మాత్రం వాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సౌత్ పరిశ్రమపై చాలా ఘాటు వ్యాఖ్యలే చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినా.. తనకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమనే. ఆ తర్వాత మెల్లగా అన్ని పరిశ్రమలను కవర్ చేస్తూ వెళ్లింది. హిందీ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. హీరోయిన్‌గా పరిచయమయ్యి ఎన్నో ఏళ్లు అవుతున్నా కూడా తమన్నా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ సీనియర్ హీరోలతో జోడీకడుతూ తన కెరీర్‌ను బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ..
అక్కడ పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారకొన్ని కమర్షియల్ సినిమాల్లో నేను నా క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యేదాన్ని కాదు. అందుకే మేకర్స్‌ను నా క్యారెక్టర్ తగ్గించమని కోరేదాన్ని. అలా చూసి చూసి మెల్లగా అలాంటి పాత్రలు చేయడమే మానేశాను. విషపూరితమైన పురుషాధిక్యతని సెలబ్రేట్ చేసుకొనే సినిమాల్లో భాగం కాకూడదని చేతనైన ప్రయత్నం చేస్తున్నా.’’ అని పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చింది. తమన్నా (Tamanna) చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!