Actress Urvashi: నటి ఊర్వశి దెబ్బకి విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయారట..!

‘చక్రం’ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన సీనియర్ నటి ఊర్వశి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈమె హీరోయిన్ గా కూడా చేసింది. బాలకృష్ణ హీరోగా నటించిన ‘భలే తమ్ముడు’ అలాగే ‘కాల రుద్రుడు’ వంటి సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా తమిళ, మలయాళ, హిందీ, కన్నడంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అటు తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ ‘చక్రం’ తో పాటు గోపీచంద్ ‘జిల్’, పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాల్లో కూడా నటించింది. అంతేకాదు ఈమె బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉంటుంది. పలు టీవీ సీరియల్స్ తో పాటు ‘రచ్చబండ’ టైపు టీవీ షోలకు ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే గతంలో ఈమె హోస్ట్ చేసిన ‘రచ్చబండ’ టైపు ఓ టీవీ షో లో ఈమె భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టింది. నిజానికి వాళ్ళ ఉన్న గొడవలను క్లియర్ చేసి కలపడం అనేది ఈ షో కాన్సెప్ట్. కానీ అది మానేసి ఊర్వశి ఇష్టమొచ్చినట్టు మాట్లాడిందట.

దీంతో ఆ జంట విడాకులు తీసుకునే వరకు వెళ్ళారట. ‘ఊర్వశి మాటల వల్ల నా భర్త నాకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు’ అంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఆ షోకి ఊర్వశి మద్యం సేవించి రావడం వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు’ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు గాను పూర్తి బాధ్యత ఊర్వశి మరియు ఆ టీవీషోలదే అంటూ ఆ మహిళ డిమాండ్ చేసింది. దీంతో ఆ షో నిర్వహకులు కిందా మీద పడి ఆ సమస్యను క్లియర్ చేశారు. అంతేకాకుండా ఊర్వశిని కూడా తాగి షూటింగ్ రావద్దు అంటూ హెచ్చరించారు. అంతకు ముందు కూడా ఈమె చాలా సార్లు తాగి షూటింగ్ కు వచ్చిన సందర్భాలు ఉన్నాయట.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus