తాజాగా ఓ నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆమెను వేధిస్తూ… బెదిరింపులకు పాల్పడ్డారని ఆ నటి చెప్పుకొచ్చింది. ఆమె మరెవరో కాదు.. తమిళ సినీ నటి విజయలక్ష్మి. ఇంతకుముందే ఆమె.. ‘ నామ్ తమిళర్ పార్టీ నేత సీమన్, పనన్ కట్టు పడైకి చెందిన హరి నాడార్ వారు తమ అనుచరులతో ఈమెను సోషల్ మీడియా వేధిస్తున్నట్టు ఓ వీడియో రూపంలో చెప్పుకొచ్చింది. అయితే నిన్న సూcide చేసుకుంటున్నట్టు కూడా ఓ వీడియోని విడుదల చేసి అందరినీ ఆందోళనకు గురిచేసిందనే చెప్పాలి.
విజయలక్ష్మి వీడియో ద్వారా మాట్లాడుతూ.. “ఇది నా చివరి వీడియో. సీమన్ మరియు అతని పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యాను. వాళ్ళ నుండీ నా కుటుంబాన్ని కాపాడుకోవాలని చాలా ట్రై చేశాను. మీడియా వేదికగా నన్ను హరి నాడార్ అవమానించారు. నేను ఇప్పుడు బీపీ మాత్రలు తీసుకుంటున్నాను. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తరువాత నేను మరణిస్తాను.నా మరణం వాళ్లకు కనువిప్పు కావాలి.
సీమన్, హరి నాడార్ లను వదిలిపెట్టొద్దు.” అంటూ విజయలక్ష్మి వీడియోలో చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె సన్నిహితులు వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.