‘అ!’ లో నటించిన హీరోయిన్స్ ఎంత రెమ్యునరేష్ తీసుకున్నారు ?

నేచురల్ స్టార్ నాని హీరోగానే కాదు.. నిర్మాతగానూ విజయాన్ని అందుకున్నారు. తన వాల్ పోస్టర్ బ్యానర్లో నిర్మితమైన ‘అ!’ సినిమా నిన్న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ఆసమ్ అంటున్నారు. సినీ స్టార్లు సైతం ప్రసంశలు గుప్పిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నిత్యా మీనన్‌, కాజల్‌ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బ వంటి హీరోయిన్స్ నటించారు. వారు ఒక సినిమాకి లక్షలు కోట్లు తీసుకుంటారు. కానీ ఈ కథ నచ్చడంతో వారు ఉచితంగా చేసారని వార్తలు చక్కర్లు కొట్టాయి. నానిపై గౌరవంతో రెమ్యునరేషన్ తగ్గించుకున్నారనే టాక్ కూడా ఉంది.

వీటిపై నాని స్పందించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన అతను హీరోయిన్ రెమ్యునరేషన్స్ పై మాట్లాడారు. “అ!” లో నటించిన హీరోయిన్స్ ఎవరూ తమ పారితోషికాన్ని తగ్గించుకోలేదని స్పష్టం చేశారు. వారు ఇతర సినిమాలకు తీసుకునే విధంగా లెక్కకట్టి ప్రతి పైసా ఇచ్చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ హీరోయిన్స్ ఒక సినిమాకి 40 నుంచి 50 రోజుల కాల్షీట్స్ ఇస్తారు. “అ!” కి 5 నుంచి పది రోజుల డేట్స్ ఇచ్చారు. ఆ లెక్కన పారితోషికాన్ని అందించినట్లు నాని తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus