Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

కొన్ని గంటల నుండి ఇండస్ట్రీలో ఎక్కువగా ‘అఖండ 2’ (Akhanda 2) గురించే చర్చ నడుస్తుంది. కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్లో వస్తున్న పెద్ద సినిమా ఇది. టాలీవుడ్ కి ఇప్పుడు ఓ పెద్ద హిట్టు చాలా అవసరం. అప్పుడే థియేటర్ల వ్యవస్థ కాస్త మెరుగుపడుతుంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్.. సరైన సినిమా లేక చాలా వరకు మూతబడ్డాయి. దీంతో అందరి దృష్టి ‘అఖండ 2’ పై పడింది. అందులోనూ బాలయ్య- బోయపాటి శ్రీను..లకు మాస్ ఆడియన్స్ లో తిరుగులేని ఇమేజ్ ఉంది. వీళ్ళ కాంబోలో సినిమా అంటే కచ్చితంగా 4 వారాలైనా సింగిల్ స్క్రీన్స్ కళకళలాడతాయి.

Akhanda 2 Thaandavam Twitter Review

పైగా ‘అఖండ’ వంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన సినిమా కాబట్టి.. ‘అఖండ 2’ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈరోజు అనగా డిసెంబర్ 5న ‘అఖండ 2’ (Akhanda 2) రిలీజ్ కానుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘అఖండ 2’ స్టార్టింగ్ 15 నిమిషాలు ‘అఖండ’ లోని కొన్ని కీలక సన్నివేశాలు చూపించి.. విలన్ రోల్ తో వరల్డ్ బిల్డింగ్ చేసినట్టు తెలుస్తుంది.

15 నిమిషాల్లో మురళీకృష్ణ(చిన్న బాలయ్య) ఎంట్రీ. తర్వాత ఫ్యామిలీ సీన్స్ వచ్చాయట. ‘జాజికాయ’ పాట కూడా ఫాస్ట్ గానే వచ్చేస్తుందట. తర్వాత పాప స్టోరీ వస్తుందని తెలుస్తోంది. ఆమె ఓ ప్రమాదంలో చిక్కుకోవడం.. విలన్ గ్యాంగ్ ఆమెను చంపడానికి ప్రయత్నించడం.. ఈ టైంలో అఘోర(పెద్ద బాలయ్య) ఎంట్రీ వస్తుందట. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుండీ ఇంటర్వెల్ సీన్ వరకు గూజ్ బంప్స్ గ్యారంటీ అంటున్నారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. ఇక సెకండాఫ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఎపిసోడ్స్ వస్తాయని.. క్లైమాక్స్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. మాస్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ అంటున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

 

 

‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus