Trivikram, Venkatesh: ఆ పేరేంటి.. ఆ రక్తమేంటి.. త్రివిక్రమ్‌ ప్లానింగేంటి?

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విసయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఈ కాంబో ఇప్పటికి వీలైంది. ఆ మధ్య సినిమా పనులు మొదలయ్యాయని ఇద్దరూ కలసి ఉన్న ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసి చెప్పిన టీమ్‌.. ఇప్పుడు పోస్టర్‌ విత్‌ టైటిల్‌ రిలీజ్‌ చేసింది. దాంతోపాటు సినిమా షూటింగ్‌ మొదలైంది అనే మాట కూడా రాసుకొచ్చింది. వీటితోపాటు సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని కూడా చెప్పేసింది. దీంతో ఒక్క పోస్టర్‌తో చాలా విషయాలు తెలిసిపోయాయి.

Trivikram, Venkatesh

త్రివిక్రమ్‌ తన సెంటిమెంట్‌ అక్షరం ‘ఆ’ తో ఈ సినిమాకు టైటిల్‌ పెట్టారు. ‘ఆదర్శ కుటుంబం’ అంటూ సినిమాకు చాలా సాఫ్ట్‌ టైటిల్‌ పెట్టారు. అయితే ఇంటి పేరు 47 అంటూ ఓ చిన్న ట్విస్ట్‌ ఇచ్చారు. అంటే మొత్తం టైటిల్‌ అంతా కలిపితే AK 47 అవుతుంది. సినిమాను ఈ పేరుతోనే పాపులర్‌ చేయాలని, దీనినే మెయింటైన్‌ చేయాలని చూస్తున్నారు. అంటే సినిమాలో సాఫ్ట్‌ ఎలిమెంట్స్‌తోపాటు, యాక్షన్‌ అంశాలు ఉన్నాయి అని టీమ్‌ చెప్పకనే చెప్పాలని చూస్తోందన్నమాట.

ఇక టైటిల్‌ లోగోలో సినిమాకు సంబంధించి మరో అంశాన్ని చెప్పారు త్రివిక్రమ్‌. అదే రక్తపు చారలు. టైటిల్‌లో కుటుంబం అనే పదం చివరిలో ఎరుపు రంగులో హైలైట్ చేస్తూ ఒక రక్త ప్రవాహం కనిపిస్తోంది. దాని బట్టి సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సర్‌ప్రైజింగ్‌గా థ్రిల్లింగ్‌ అంశాలు కూడా ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ కథకు, మాస్‌ ఎలిమెంట్స్‌ జోడించి త్రివిక్రమ్‌ ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘అరవింద సమేత’లో ఇప్పటికే మనం చూశాం. ఆ లెక్కన ఇప్పుడు ‘ఏకే 47’ కూడా ఆ కోవకే చెందుతుంది అంటున్నారు.

సమ్మర్‌లో రిలీజ్‌ అంటే ఏప్రిల్‌ ఆఖరున కానీ, మే మొదట్లో కానీ సినిమా రావొచ్చు అని చెబుతున్నారు. అంటే సినిమాను రికార్డు స్థాయిలో నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తారట. గతంలో ఇలా వేగంగా సినిమాలు చేసిన అనుభవం త్రివిక్రమ్‌కు ఉంది కూడా.

‘ఖైదీ 2’.. ఆ అనుమానాలే నిజమవుతున్నాయా.. కార్తి మాటలు వింటే..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus