Anita Hassanandani: నన్ను క్షమించు నాన్నా.. హీరోయిన్ అనిత కామెంట్స్ వైరల్!

నువ్వు నేను (Nuvvu Nenu) , శ్రీరామ్ సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ అనితకు (Anita Hassanandani) తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఈ నటి తండ్రిని తలచుకుంటూ కొన్ని కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాన్నకు తాగుడు అలవాటు ఉండేదని ఆ అలవాటును చూసి నాన్నపై కోపం పెంచుకున్నానని అనిత తెలిపారు. మన జీవితంలో నాన్నకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

Anita Hassanandani

నాన్న గురించి నేనెప్పుడూ పెద్దగా మాట్లాడలేదని అలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో కూడా తెలియదని అనిత వెల్లడించారు. కానీ ప్రస్తుతం నాన్నను ఎంతో మిస్ అవుతున్నానని ఆమె తెలిపారు. నాకు కొడుకు పుట్టిన తర్వాత కానీ నాన్న ప్రేమ అర్థం కాలేదని నాన్న ఆరవ్ ను కలవాల్సిందని తనతో ఆడుకోవాల్సిందని ఆమె చెప్పుకొచ్చారు.

నాన్న విషయంలో పెద్ద తప్పు చేశానని నాన్న తాగుబోతు అని ఎంతో కోప్పడ్డాడని మద్యానికి బానిసై దాని నుంచి నాన్న బయట పడలేకపోతున్నాడని అర్థం చేసుకోలేకపోయానని అనిత వెల్లడించారు. నాన్నపై అంత కోపం చూపించాల్సిందని కాదని ఆమె తెలిపారు. 15 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలోనే నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడని అనిత చెప్పుకొచ్చారు. నాన్న నన్ను క్షమించాలంటూ అనిత పరోక్షంగా తన కామెంట్ల ద్వారా చెప్పుకొచ్చారు.

అనిత రిసెప్షనిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఫోటోషూట్స్, అడిషన్స్ తో నటన వైపు అడుగులు వేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు, సీరియళ్లలో సైతం ఆమె నటించారు. అనిత వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిత తెలుగు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనిత వయస్సు 43 సంవత్సరాలు కాగా ఇప్పటికీ ఆమె గ్లామరస్ గానే కనిపిస్తున్నారు.

హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus