Adhire Abhi: గాయాల పాలైన ‘జబర్దస్త్’ కమెడియన్ అదిరే అభి..!

  • June 14, 2022 / 02:13 PM IST

‘జబర్దస్త్’ ఫేమ్ అదిరే అభి.. అందరికీ సుపరిచితమే. ఇటీవల అతనికి యాక్సిడెంట్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభి కి తీవ్ర గాయాలు అయినట్లు కూడా తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. అదిరే అభి హీరోగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ లో భాగంగా ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభి కింద పడిపోయాడు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది అభిని వెంటనే హాస్పిటల్ కు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది.

అతని చేతికి మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వైద్యులు అతని చేతికి 15 కుట్లు వేసినట్లు సమాచారం.అభి గాయాల పాలవ్వడంతో షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు.. అభి కోలుకుంటున్నారని వైద్యులు, అతని సన్నిహితులు చెప్పుకొచ్చారు. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఈశ్వర్’ చిత్రంలో హీరో స్నేహితుడి పాత్రలో అభి నటించాడు. అటు తర్వాత ‘విష్ణు’ ‘ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు’ ‘విద్యార్థి’ ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’ ‘ప్రేమికులు’ ‘మా నాన్న చిరంజీవి’ ‘ఈగ’ ‘రాగల 24 గంటల్లో’ ‘బాహుబలి2’ ‘ రాంగ్ గోపాల్ వర్మ’ వంటి చిత్రాల్లో నటించాడు అభి.

బాహుబలి సినిమాకు గాను ఇతను దర్శకత్వ శాఖలో కూడా పనిచేశాడు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.’పాయింట్ బ్లాంక్’ ‘ వైట్ పేపర్’ వంటి చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు. ప్రస్తుతం హీరోగా ఇంకా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా అభికి మంచి గుర్తింపు లభించింది. ఆ షోలో ఎన్నో స్కిట్లు చేసి విన్నర్ గా నిలిచిన అభి.. తన డైలాగ్ డెలివరీతో యూత్ కు దగ్గరయ్యాడు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus