గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్!

షీలా కౌర్ (Sheela kaur) అందరికీ సుపరిచితమే. ‘అదుర్స్’ (Adhurs) హీరోయిన్ గా ఈమె బాగా ఫేమస్. అయితే అంతకు ముందు ఈమె అల్లు అర్జున్ (Allu Arjun) ‘పరుగు’ (Parugu) సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. 2006 లో నవదీప్ (Navdeep Pallapolu) హీరోగా వచ్చిన ‘సీతాకొక చిలుక’ (Seethakoka Chiluka) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘రాజూ భాయ్’ (Raju Bhai) ‘హలో ప్రేమిస్తారా?’ ‘పరుగు’ ‘మస్కా’ (Maska) వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఎన్టీఆర్ ‘అదుర్స్’ లో కూడా నటించి మెప్పించింది.

తక్కువ టైంలోనే ఎన్టీఆర్ (Jr NTR) , అల్లు అర్జున్, రామ్ (Ram) వంటి హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. తర్వాత 2011 లో బాలకృష్ణతో (Nandamuri Balakrishna) చేసిన ‘పరమవీరచక్ర’ (Parama Veera Chakra) సినిమా తర్వాత టాలీవుడ్ కి దూరమైంది. ఆ తర్వాత కన్నడంలో ఓ సినిమా చేసింది కానీ.. అది పెద్దగా ఆడలేదు. అయితే ఈమె చేసిన సినిమాలు ఎక్కువ శాతం బాగానే ఆడినా.. ఎందుకో ఈమె త్వరగానే సినిమాలకు దూరమైంది. దీనికి కారణం ఏంటి అనే విషయంపై అప్పట్లో పెద్ద చర్చే నడిచింది.

టాలీవుడ్లో ఓ బడా నిర్మాత ఈమెను ఫిజికల్ గా బాగా వాడుకుని, ప్రెగ్నెంట్ చేశాడని., ఆ కారణంగా ఈమె నోరు మూయించడానికి కొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేసి.. తిరిగి టాలీవుడ్ వైపు చూడొద్దని ఆ నిర్మాత హెచ్చరించినట్టు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది నిజమో లేదో తెలీదు కానీ, 2020 లో సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటితో ఆమె గుర్తుపట్టలేని విధంగా ఉండటం అందరికీ షాకిచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus