యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన అదుర్స్ సినిమా 2010 సంవత్సరంలో రిలీజై హిట్ గా నిలవగా ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను రీరిలీజ్ చేయడం జరిగింది. పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రీరిలీజ్ కాగా ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమా రిజల్ట్ తో రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చేయాలని భావిస్తున్న నిర్మాతలు వెనక్కు తగ్గుతున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ సినిమానే చూడకపోతే మన సినిమాలను ఎవరు చూస్తారు అంటూ కొంతమంది హీరోలు సైతం ఫీలవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అదుర్స్ రీరిలీజ్ వల్ల ఇండస్ట్రీకి చెందిన ఎంతోమందికి జ్ఞానోదయం అయిందని తెలుస్తోంది. అదుర్స్ రీరిలీజ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని ఫీలైన ఫ్యాన్స్ ఈ సినిమా రిజల్ట్ తో నిరాశకు గురయ్యారు. అయితే ప్రతి సినిమాను (Adhurs) రీరిలీజ్ చేయడం కూడా సరైన నిర్ణయం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కలిగించని సినిమాలను రీరిలీజ్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుందని సినిమాలను రీరిలీజ్ చేస్తున్న మేకర్స్ ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే దేవర సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ సాధిస్తానని ఈ స్టార్ హీరో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తారక్ దాదాపుగా రెండేళ్ల సమయాన్ని ఈ సినిమా కోసమే కేటాయించడం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉండగా సొంత బ్యానర్ లో తారక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. లాభాల్లో వాటా తీసుకుంటూ తారక్ సినిమాలు చేస్తున్నారని సమాచారం. తన సినిమాలకు నష్టాలు రాకుండా తారక్ అడుగులు పడుతున్నాయి. స్క్రిప్ట్ విషయంలో తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా దేవర సినిమాకు మైథలాజికల్ టచ్ కూడా ఉందని తెలుస్తోంది.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!