Adi Reddy, Shrihan: దెయ్యం టాస్క్ లో ఫుల్ ఫన్..! ఎపిసోడ్ లో హైలెట్ అదే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ప్రైజ్ మనీ రివకవరీ జరుగుతోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ వివిధ ఛాలెంజస్ ని హౌస్ మేట్స్ కి ఇస్తూ బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్నాడు. ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో ముందుగానే గెస్ చేసి చెప్తేనే డబ్బులు ఇస్తానని తిరకాసు పెట్టాడు. ఐదో ఛాలెంజ్ లో భాగంగా రోహిత్ ఇంకా ఆదిరెడ్డి ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడే తలో 20వేలు ఇచ్చి బెట్టింగ్ లాగా ఎవరు గెలుస్తారో చెప్పమని చెప్పాడు బిగ్ బాస్.

ఇందులో విన్నర్ ఎవరిని ఎంచుకోవాలి అనేది హౌస్ మేట్స్ కి ఛాలెంజ్ గా మారింది. నలురుగు ఇంటి సభ్యులు ఆదిరెడ్డిని, శ్రీసత్య మాత్రం రోహిత్ ని ఎంచుకున్నారు. ఇక ఛాలెంజ్ మొదలు అవ్వగానే ఆదిరెడ్డి – రోహిత్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. మొదటగా టాస్క్ ని ఫినిష్ చేసిన ఆదిరెడ్డి బెల్ ని మోగించి విన్నర్ అయ్యాడు. దీంతో హౌస్ మేట్స్ 80వేలు గెలుచుకున్నారు. ఆ తర్వాత టాస్క్ జరిగేకంటే ముందు కిచెన్ లో రేవంత్ తో ఆర్గ్యూమెంట్స్ అయ్యాయి.

పరవాన్నం కోసం కాసేపు వాదన పెట్టుకున్నాడు రేవంత్. ఫస్ట్ నుంచీ రేవంత్ కి కిచెన్ లో గొడవలు అవుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఛాలెంజ్ లో కీర్తి ఇంకా శ్రీహాన్ ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడే కీర్తి ముందుగానే అందరూ శ్రీహాన్ కి ఓటేస్తారని గెస్ చేసి శ్రీహాన్ కి బాగా ఆడమని చెప్పింది. దీంతో పంచ్ టాస్క్ లో శ్రీహాన్ ముందుగానే కుండని బద్దలు కొట్టి ప్రైజ్ మనీని పెంచుకున్నాడు. ఇక దెయ్యం టాస్క్ లో అసలు మజా అనేది వచ్చింది.

గత రెండు రోజుల నుంచీ ఇంట్లో దెయ్యం టాస్క్ ఉంటుందని అనుకుంటున్నారు హౌస్ మేట్స్. అంతేకాదు, అర్దరాత్రి ఆదిరెడ్డిని, శ్రీహాన్ ని ఆటపట్టించారు కూడా. దీనికి తోడు బిగ్ బాస్ కూడా సౌండ్స్ వేస్తూ వాళ్లని హడలెత్తించాడు. ఇక తర్వాత ఛాలెంజ్ లో ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. అక్కడ మొత్తం చీకటిగా ఉండటంతో ఆదిరెడ్డి భయపడిపోయాడు. ఆ చీకట్లో ఆదిరెడ్డితో ఒక ఆట ఆడుకున్నాడు బిగ్ బాస్. అక్కడ ఉన్న కొవ్వొత్తిని వెతికి పట్టుకోమని చెప్పాడు.

వీలైతే ఎవరినైనా తోడు పిలుచుకోవచ్చని ఆప్షన్ ఇచ్చాడు. దీంతో ఆదిరెడ్డికి శ్రీహాన్ తోడైయ్యాడు. ఇక్కడే అసలు మజా వచ్చింది. ఇద్దరూ కలిసి చీకటి రూమ్ లో భయపడి ఛచ్చారు. ఒకరిని ఒకరు పట్టుకుంటూ హడలెత్తిపోయారు. బిగ్ బాస్ అక్కడ ఒక మనిషిని పెట్టి మరీ వాళ్లని దడిపించాడు. ఎట్టకేలకి భయపడుతూనే కొవ్వొత్తిని , గన్ ని తీస్కుని డబ్బులు సంపాదించారు హౌస్ మేట్స్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus