చుట్టాలబ్బాయి, కార్తికేయను రీమేక్ చేస్తాడట!

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకుంది నిఖిల్ కార్తికేయ. ఇప్పుడీ సినిమాని కన్నడలో రీమేక్ చేయబోతున్నారు. ఈ కన్నడ రీమేక్ లో సాయికుమార్ తనయుడు హీరో ఆది నటిస్తాడని సమాచారం. సాయికుమార్ కు కన్నడ నాట ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ సినిమాతో ఆదిని కూడా కన్నడలో హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని వినిపిస్తోంది.

ఈ సినిమాని సాయికుమారే నిర్మిస్తారని టాక్. ప్రస్తుతం ఆది ‘చుట్టాలబ్బాయి’ సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన తన సొంత బ్యానర్ లో చేసిన ‘గరం’ సినిమా నిరాశ పరిచింది. ఈ నేపధ్యంలో మరోసారి సొంత బ్యానర్ లో కన్నడలో సినిమా చేయబోతున్నాడు. మరి ఈ సినిమాతో అయినా ఆదిని సక్సెస్ వరిస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి టెక్నీషియన్స్ ఎవరనే విషయాలు తెలియాల్సివుంది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus