Adipurush: ఆ సినిమాలపై ఆదిపురుష్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందా?

ఆదిపురుష్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో ప్రదర్శితం కానుంది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ తో రిలీజవుతున్న ఆదిపురుష్ మూవీ ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఆదిపురుష్ మూవీ ఎఫెక్ట్ చాలా సినిమాలపై ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ఆధారంగా పలు సినిమాల రిలీజ్ డేట్లు మారనున్నాయని తెలుస్తోంది.

ది ఫ్లాష్ మూవీ కలెక్షన్లపై కూడా ఆదిపురుష్ మూవీ ఎఫెక్ట్ భారీ స్థాయిలో పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిఖిల్ నటించిన స్పై, కార్తికేయ బెదురులంక 2012, నాగశౌర్య రంగబలి, అల్లు శిరీష్ బడ్డీ సినిమాలపై ప్రభావం పడనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కొత్త సినిమాలకు థియేటర్లు కూడా దొరక్దం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ ఏ జానర్ సినిమాలో నటించినా ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తున్నారు. బాహుబలి, బాహుబలి2 సినిమాలను మించి ఈ సినిమా కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత కొన్నేళ్లలో మైథలాజికల్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాలేదు. ఆదిపురుష్ సినిమా ఆ లోటును కూడా భర్తీ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. ఆదిపురుష్ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆదిపురుష్ సినిమా ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆదిపురుష్ పై అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus